మహానంది మండలం బుక్కాపురం పొదుపు భవనంవద్ద 18 వ విడత 2023-24 ఆర్థిక సంవత్సరం సామజిక తనిఖీ ప్రజా వేదిక కార్యక్రమం ఎంపీడీవో మహబూబ్ దౌల అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో అధికారులు ముందుకు కుర్చీల్లో ఆయా గ్రామాల రైతులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ, ఉపాధికి సంబంధించిన లబ్ధిదారులు గానీ కనిపించకపోవడంపై పీడీ జనార్ధన రావు ఎందుకు రాలేదంటూ అధికారులను ఆరా తీశారు.