మహానంది మండలంలోని గ్రామాల్లో రైతులు పొలాలకు వెళ్లే రహదారులు బాగాలేక ఇబ్బందులు పడుతున్నారని, ఉపాధి హామీ పథకం పనులతో అనుసంధానం చేసి మట్టి రోడ్లు బాగుచేయాలని నంద్యాల జిల్లా డ్వామా పీడి జనార్దన్ రావును టిడిపి నాయకులు కోరారు. మంగళవారం మహానంది మండలం బుక్కాపురం గ్రామంలోని వెలుగు కార్యాలయంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం బహిరంగ సామాజిక తనిఖీ కార్యక్రమంలో పీడీని కలిసి వినతిపత్రం అందజేశారు.