ఎమ్మిగనూరు పట్టణంలో శ్రీనీలకంఠేశ్వర స్వామి జాతరను పురస్కరించుకొని డిసెంబర్ 5వ తేదీ నుంచి నిర్వహించనున్న మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి స్మారక క్రికెట్ టోర్నీ పోస్టర్లను బుధవారం మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఆవిష్కరించారు. టోర్నీ పైనల్ పోటీలు జనవరి 15న నిర్వహిస్తారని అయన తెలిపారు. మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, టోర్నీ ఆర్గనైజర్లు పాల్గొన్నారు.