ఎమ్మిగనూరు పట్టణంలోని రావూస్ డిగ్రీ కళాశాల యందు రాజ్యాంగ దినోత్సవం బి.ఏ ఆర్ట్స్ విభాగపు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పట్టణ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం. కె గురురాజరావు మాట్లాడుతూ.. అణగారిన వర్గాల ప్రజలకు భారత రాజ్యాంగం రక్షణ కవచమని, రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి విద్యార్థి సమర్థవంతంగా వినియోగించుకోవాలి దేశాభివృద్ధికి తోడ్పడాలని కోరారు.