వినాయక చవితి పురస్కరించుకుని ఎమ్మిగనూరు పట్టణంలో వినాయక చవితి వేడుకలను బుధవారం ఘనంగా ప్రారంభించారు. మండపాల వద్ద ప్రత్యేక అలంకరణలు చేసి మండపంలో ఉత్సవ కమిటీల సభ్యులు గణనాథుడిని ప్రతిష్టించారు. పలు మండపాలలో భక్తులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు గణనాథుడికి పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. వినాయక చవితి అనగానే ఫుల్ జోష్. చిన్నా. పెద్ద అనే తేడా ఉండదు. గల్లీ గల్లీల్లో మండపాలు ఏర్పాటు చేసి వినాయక విగ్రహాలను ప్రతిష్టించారు. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు.