ఎమ్మిగనూరు పట్టణంలో సెబ్ పోలీస్ స్టేషన్లో సెబ్ సీఐ జయరాం నాయుడు ఆధ్వర్యంలో అక్రమ మద్యం, నాటుసారా తరలిస్తూ పట్టుబడిన వాహనాలను బుధవారం ఉదయం ఆదోని మోటార్ వెహికల్ అధికారి తనిఖీ నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆటోలో ప్రయాణికులకు ఎక్కువ లోడుతో తరలిస్తే చర్యలు తీసుకుంటామని ఆదోని మోటార్ వెహికల్ అధికారి సిసిర దీప్తి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సెట్ సీఐ జయరాం నాయుడు, ఎస్సై సిబ్బంది పాల్గొన్నారు.