అంతర్జాతీయ యోగ దినోత్సవ జూన్ 21 సందర్భంగా ఎమ్మిగనూరు పట్టణంలో మాచాని సోమప్ప ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో బుధవారం ఎన్సిసి ఆఫీసర్ అద్వారంలో విద్యార్థులతో యోగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. యోగ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ యోగా అనేది మన నాగరికత సాధించిన గొప్ప విజయాల్లో ఒకటని చెప్పారు.ఈ ప్రపంచానికి
భారత్ అందించిన గొప్ప బహుమతుల్లో యోగా ఒకటని కొనియాడారు. ఇది మన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుతుందన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎన్సిసి ఆఫీసర్ సింగ్ నైగి, ఏ ఎన్ ఓ కళ్యాణి, సీటీవో గంగాధర్, మరియు ప్రధాన పాఠశాల ఉపాధ్యాయులు, శారద,ఇందిరా,వీరేష్,నటరాజ్,గౌతమ్,పద్మ,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.