ఎమ్మిగనూరు పట్టణంలో సెబ్ స్టేషన్ పరిధిలోని సీజ్ చేయబడిన 67 కేసుల్లో లోని పట్టుబడిన కర్ణాటక అక్రమ మద్యం బాటిళ్లను మంగళవారం వెంకటగిరి గ్రామ శివార్లో స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ కృష్ణ కాంత్ పటేల్ మరియు అసిస్టెంట్ ఎన్ ఫోర్స్ మెంట్ సూపరిటెంట్ కర్నూల్ రాజశేఖర్ ఆదేశాల మేరకు సెబ్ సీఐ జయరాం నాయుడు ఆధ్వర్యంలో ఒరిజినల్ ఛాయిస్ కర్ణాటక టెట్రా ప్యాకెట్లను ధ్వంసం చేశారు. భారీ మొత్తంలో సెబ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడిన మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. మొత్తం 13 లక్షల విలువైన 24500 కర్ణాటక టెట్రా ప్యాకెట్ల ధ్వంసం చేశారు.