నాణ్యమైన భోజనం అందించాలి: రెండో వార్డు ఇన్చార్జ్ రాము

2239చూసినవారు
నాణ్యమైన భోజనం అందించాలి: రెండో వార్డు ఇన్చార్జ్ రాము
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని రెండో వార్డు ఇంచార్జ్ సిరసాల రాము సూచించారు. ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం ఎమ్మిగనూరు పట్టణంలో రెండో వార్డులోని భవాని పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రభుత్వం అమలు చేసిన మోనూ తప్పనిసరిగా పాటించాలన్నారు. మెను ప్రకారం విద్యార్థులకు శనివారం అన్నం, సాంబార్, స్వీట్ గుడ్డు, చీక్కి అందించారా లేదా అని తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులు వ్రాత నైపుణ్యం మరింత మెరుగు పరుచుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థి విలువలతో కూడిన విద్యను అలవర్చుకోవాలన్నారు. అంతే కాకుండా ఎప్పటికప్పుడు తాజా కూరగాయాలతో మధ్యాహ్నం భోజనం వండాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్