రోడ్డుపై నిలిచిన వర్షపు నీరు.. అవస్థల్లో ప్రజలు

1927చూసినవారు
రోడ్డుపై నిలిచిన వర్షపు నీరు.. అవస్థల్లో ప్రజలు
ఎమ్మిగనూరులో మంగళవారం కురిసిన వర్షానికి నీరు రోడ్లపై నిలిచిపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. భారీగా వర్షం కురవడంతో 2వ వార్డు ముగతి పేట కాలనీలోని రోడ్లపై నీరు నిలిచింది. కాలనీలో రోడ్లు, డ్రెనేజీ కాలువలు సరిగా లేకపోవడంతో నీళ్లు నిలుస్తున్నాయని వార్డు ప్రజలు పేర్కొంటున్నారు. అధికారులు స్పందించి కాలనీలో సిమెంటు రోడ్లు, డ్రెయినేజీ కాల్వలు ఏర్పాటు చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్