భారీ వర్షంతో స్తంభించిన జన జీవనం

5190చూసినవారు
భారీ వర్షంతో స్తంభించిన జన జీవనం
ఎమ్మిగనూరు పట్టణంలో భారీ వర్షం కురిసింది. బుధువారం తెల్లవారుజామున 3. 00గంటల నుండి ఎడతెరిపిలేకుండా కురిసిన కుండపోత వర్షం బీభత్సం సృష్టించడంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఉరుములు, మెరుపులతో మొదలైన వర్షం ఏకధాటిగా కురువడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పట్టణంలో లోతట్టు ప్రాంతాలైన శివ సర్కిల్, మునప్ప నగర్, ఎన్టీఆర్ కాలనీ, పలు వార్డు లో కూడా నీళ్లు చేరాయి. దుకాణాలో, కాలనీలలో ఇళ్లలోకి నీరు చేరి జన జీవనం స్తంభించింది. పట్టణంలోని కాలనీల్లో డ్రైనేజీ మురికి నీరు రోడ్ల పైకి రావడంతో పలు కాలనీల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇళ్లల్లో నడుం లోతు నీటిలో చిమ్మ చీకట్లో రాత్రంతా బిక్కుబిక్కుమంటూ పిల్లా, పెద్ద జాగారం చేయాల్సివచ్చింది. వర్షపు నీరు ఎక్కడికక్కడే నిలిచిపోయి రోడ్లపై ప్రవహించింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం వస్తే రాత్రి వేళ్లలో జాగారం చేయాల్సి వస్తుందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్