AP: కూటమి ప్రభుత్వం ప్రజలపై రూ.15 వేల కోట్ల విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపడాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈ నెల 27న నిరసనలు చేపడుతున్నట్లు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. వైసీపీ తలపెట్టిన ర్యాలీలు, వినపత్రాల సమర్పణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి నేడు జిల్లా పార్టీ అధ్యక్షులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.