ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎస్ నీరబ్ కుమార్ పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. దీంతో కొత్త సీఎస్ ఎవరనే ఉత్కంఠ నెలకొంది. సీనియార్టీ జాబితాలో ఐఏఎస్ శ్రీలక్ష్మి, అనంతరాము, సాయి ప్రసాద్ ఉన్నారు. అయితే ప్రభుత్వం సాయి ప్రసాద్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఉత్తర్వులు వెలువడుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈయన గతంలో సీఎం చంద్రబాబు పేషీలో కార్యదర్శిగా పని చేశారు.