ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఏపీ పేపర్ మిల్ లాకౌట్ ఎత్తివేస్తున్నట్లు కార్మికశాఖ జాయింట్ కమిషనర్ రాణి ప్రకటించారు. రేపటి నుంచి కార్మికులు విధుల్లోకి రావాలని పిలుపునిచ్చారు. సమ్మె విరమింపజేసినట్లు కార్మకశాఖ జాయింట్ కమిషనర్ తెలిపారు. అయితే బయట ఉన్న కార్మికులు మాత్రం పరిశ్రమకు వ్యతిరేకంగా ఇంకా నినాదాలు చేస్తున్నారు.