AP: కుప్పంలో ఎవరైనా తోక తిప్పితే తాటా తీస్తానంటూ సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నేడు కుప్పంలో పర్యటించిన ఆయన సూర్యఘర్ పథకం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'గత ఐదేళ్లుగా కుప్పాన్ని నాశనం చేశారు. అడ్డదిడ్డంగా దోచుకున్నారు. చెడు వ్యక్తులకు సహకరించకండి.. ఎన్ని తప్పులు చేయాలో అన్ని తప్పులు చేశారు కాబట్టే 11 సీట్లు వచ్చాయి. ఇక ముందు ఆ సీట్లు కూడా రావు' అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు.