రైళ్లకు సంబంధించిన అన్ని సేవలూ ఒకేచోట అందించే ఓ సూపర్ యాప్‌ను భారతీయ రైల్వే తాజాగా అందుబాటులోకి తెచ్చింది. ‘స్వరైల్’ పేరిట దీన్ని లాంచ్ చేసింది. అయితే ఇది టెస్టింగ్ దశలో ఉండడంతో ప్రస్తుతం పరిమిత సంఖ్యలో యూజర్లు మాత్రమే వాడేందుకు వీలుంటుంది. ఫీడ్ బ్యాక్ ఆధారంగా మార్పులు, చేర్పులు చేసి ఈ యాప్‌ను త్వరలో అందుబాటులోకి తేనున్నారు.