ఆటోలో కుంభమేళాకు వెళ్లిన ఏపీ యువకులు (వీడియో)

85చూసినవారు
AP: కుంభమేళాకు వెళ్లేందుకు ఏపీ యువకులు పెద్ద సాహసమే చేశారు. రైళ్లు, బస్సులు, విమానాలు వదిలేసి ఏకంగా ఆటోలోనే ప్రయాణించారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం గుండ్లకట్టమంచికి చెందిన వీరు ఆటోలో కుంభమేళాకు వెళ్లారు. జనవరి 27న కాణిపాకంలో దర్శనం అనంతరం కర్నూలు, హైదరాబాద్, జబల్పూర్, రేవా మీదుగా ప్రయాగ్‌రాజ్, అక్కడి నుంచి కాశీకి వెళ్లారు. ఆటో వెనుక సీటు తొలగించి పరుపు ఏర్పాటు చేసుకున్నారు. రూ.20 వేలల్లో ముగ్గురూ తమ యాత్రను ముగించారు.

సంబంధిత పోస్ట్