మగవారి పొదుపు సంఘాలకు అనూహ్య స్పందన

65చూసినవారు
మగవారి పొదుపు సంఘాలకు అనూహ్య స్పందన
AP: మగవారి పొదుపు సంఘాలకు అనూహ్య స్పందన లభిస్తోంది. తొలి దశలో రాష్ట్రవ్యాప్తంగా 2,841 గ్రూపులను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకోగా.. నెల రోజుల్లోనే 1,028 సంఘాలు ఏర్పడ్డాయి. మార్చి 31 నాటికి టార్గెట్‌ను చేరుకునేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. భవన నిర్మాణ కార్మికులు, రోజువారీ కూలీలు, సెక్యూరిటీ గార్డులు, తదితరులు ఈ పొదుపు సంఘాలలో చేరవచ్చు. ఆర్థికంగా మెరుగుపడటానికి ఈ పొదుపు సంఘాలు ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్