బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ అర్థరాత్రి విశాఖ, గోపాలపూర్ మధ్య కళింగపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కోస్తాంధ్రలోని పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వానలు పడతాయని తెలిపింది. లోతట్ట ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.