ఏపీలో పాల ధరలు స్వల్పంగా పెంచారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి విజయ, సంగం పాల ధరలను లీటరుకు రూ.2 చొప్పున పెంచుతున్నట్లు ఆయా డెయిరీల ప్రతినిధులు వెల్లడించారు. పాల సేకరణ, ప్యాకింగ్ సామగ్రి, డీజిల్ ధరలు, ఇతర వ్యయాలు పెరగడంతో ధరలు స్వల్పంగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని వారు స్పష్టం చేశారు.