కర్నూల్ జిల్లా హొలగుంద మండలం మార్లమడి గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీసు లేదు. దీంతో తమ గ్రామానికి బస్సు నడపాలని కోరుతూ విద్యార్థి సంఘాలు మంత్రి లోకేష్‌కి మెయిల్ చేశాయి. వెంటనే స్పందించిన లోకేష్.. ఈ విషయాన్ని రవాణాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో ఆదోనీ ఆర్టీసీ డిపో అధికారులు ఆ గ్రామానికి బస్సు సర్వీసును ప్రారంభించారు.