AP జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆదివారం మినీ వ్యాన్ను నడిపారు. టిడ్కో గృహ వాసులు పాలకొల్లు పట్టణానికి ప్రయాణించేందుకు వీలుగా రూ.8 లక్షలతో కొత్త మినీ వాహనాన్ని ఆయన సొంత డబ్బులతో కొన్నారు. ముందుగా ఆయన ఆ వాహనాన్ని కొద్ది దూరం నడిపి చూపారు. పట్టణానికి వెళ్లేందుకు వీలుగా ఉచిత వాహనాన్ని ఏర్పాటు చేసినందుకు టిడ్కో కాలనీ ప్రజలు మంత్రి రామానాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.