ఎన్నికలపై మంత్రి అంబటి హాట్ కామెంట్స్

72చూసినవారు
ఎన్నికలపై మంత్రి అంబటి హాట్ కామెంట్స్
ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా జరగలేదని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. కొందరు పోలీసులు కూటమికి మద్దతుగా పని చేశారని అన్నారు. జగన్‌పై గెలవలేక చంద్రబాబు హింసను ప్రేరేపించారని చెప్పారు. ఈసీ అధికారులను బదిలీ చేసిన చోటే అల్లర్లు జరిగాయని వ్యాఖ్యానించారు. అల్లర్లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్