డిప్యూటీ సీఎం పవన్ కార్యాలయంలో సీఐ దురుసు ప్రవర్తన

57చూసినవారు
డిప్యూటీ సీఎం పవన్ కార్యాలయంలో సీఐ దురుసు ప్రవర్తన
గుంటూరు జిల్లా మంగళగిరిలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో సీఐ శ్రీనివాసరావు మంగళవారం హడావుడి చేశారు. పవన్ కళ్యాణ్ లోపల ఉన్న సమయంలో అనుమతి లేకుండా వెళ్లేందుకు సీఐ ప్రయత్నించారు. ఆ సమయంలో పవన్ వారాహి దీక్ష చేపట్టేందుకు పూజలు నిర్వహిస్తున్నారు. కాసేపు ఆగాలని భద్రతా సిబ్బంది సూచించిన వినకుండా వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బూట్లతోనే లోపలికి వెళ్లారు. దీంతో బుధవారం సీఐ శ్రీనివాసరావుపై అధికారులు బదిలీ వేటు వేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్