AP: సోషల్ మీడియాలో అసభ్య పోస్టుల వ్యవహారంలో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాఘవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించడంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి పులివెందుల పీఎస్‌కు తరలించారు. కాగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డితో అసభ్య పోస్టులు పెట్టించారని రాఘవరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి.