ముంబై నటి జెత్వానీ చేస్తున్న ఆరోపణలను కుక్కల విద్యాసాగర్ ఖండించారు. ఈ వ్యవహారంపై ఆయన తొలిసారి ఓ మీడియాతో మాట్లాడారు. 'నేను ముంబైలో వ్యాపారం చేస్తున్నప్పుడు ఆమె నాకు పరిచయమైంది. అప్పట్లో ఫోటోలు దిగాను. 2014 నుంచి జెత్వానీ నన్ను డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేస్తోంది. ఆమె చూపిస్తున్న అర్ధనగ్న ఫోటో నాది కాదు. మార్ఫింగ్ చేసి బెదిరించడం ఆమెకు అలవాటు. ఆ ఫోటోను ఫోరెన్సిక్‌కు పంపుకోవచ్చు' అని తెలిపారు.