AP: రాష్ట్రంలో ఇటీవల పలువురు వైసీపీ నేతలు పార్టీని వీడి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా YCP MLC రవీంద్రబాబు కూడా పార్టీని వీడుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఎమ్మెల్సీ రవీంద్రబాబు స్పందించారు. ఇదంతా అసత్య ప్రచారమని, ఈ వార్తలను నమ్మవద్దని సూచించారు. రాష్ట్ర ప్రజలకు జగన్ ఎంతో మేలు చేశారని, అటువంటి వ్యక్తిని ఆ పార్టీని తాను వీడనని స్పష్టం చేశారు.