ఏపీలో విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సూపర్ సిక్స్‌లో భాగంగా తల్లికి వందనం పథకానికి బడ్జెట్లో నిధులు కేటాయించింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు రూ.15 వేలు చొప్పున తల్లికి వందనం పథకం ద్వారా అందించనుంది. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి ఈ పథకం సొమ్ము తల్లుల ఖాతాల్లో జమ చేయనుంది. దీనికి బడ్జెట్లో రూ.6,487 కోట్లను కేటాయించింది.