వైఎస్ జగన్‌తోనే తన ప్రయాణమని వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు స్పష్టం చేశారు. తాను వైసీపీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తనకి వైసీపీని వీడాల్సిన అవసరం లేదన్నారు. దేశంలో ఎవరూ చేయని విధంగా జగన్ తన పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారన్నారు. అలాంటి వ్యక్తిని, పార్టీ విలువలను వదిలి వెళ్లే ఆలోచన తనకు లేదని ఆయన వెల్లడించారు.