యురేనియం తవ్వకాలపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్ల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యురేనియం తవ్వకాలు జరుగవు అని చెబుతూ మంగళవారం నిజనిర్ధారణ కమిటీని ప్రకటించింది. దీనిపై ఇప్పటికే సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని వెల్లడించింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి సైతం తీసుకెళ్లారని తెలిపింది.