పిఠాపురంలో నా గెలుపు చరిత్రలో నిలిచిపోవాలి: పవన్‌

51చూసినవారు
పిఠాపురంలో నా గెలుపు చరిత్రలో నిలిచిపోవాలి: పవన్‌
’పిఠాపురంలో నా గెలుపు చరిత్రలో నిలిచిపోవాలి. ఆ బాధ్యత వర్మకు అప్పగిస్తున్నా’ అని పవన్‌ అన్నారు. ఎన్డీయే కూటమి కార్యకర్తల సమావేశంలో పవన్ మాట్లాడారు. ’’నా కోసం వర్మ తన సీటు త్యాగం చేసి నా గెలుపునకు సహకరిస్తాననడం శుభ పరిణామం. చంద్రబాబు చెప్పారు నేను చేస్తా అని ఒకే మాట చెప్పారు. ఒంటరిగా పోరాడి గెలిచే దమ్మున్న నాయుడు వర్మ. కానీ రాష్ట్రం బాగుపడాలని మంచి ఉద్దేశంతో ఆయన సీటు త్యాగం చేయడం గొప్ప విషయం‘‘ అని పవన్ అన్నారు.