AP: పార్శిల్‌లో శవం కేసులో మిస్టరీ వీడింది. చెక్క పెట్టెలో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కాళ్ల మండలం బొండాడ లంకకు చెందిన బర్రె పర్లయ్యగా గుర్తించారు. బతుకుదెరువు కోసం పర్లయ్య దినసరి కూలీగా పని చేసేవాడు. పని కోసం పర్లయ్యను శ్రీధర్ వర్మ తీసుకెళ్లి చంపి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రధాన అనుమానితుడు శ్రీధర్ వర్మ ఇంకా పరారీలో ఉన్నాడు.