పోలీస్ కస్టడీకి నందిగం సురేష్

75చూసినవారు
పోలీస్ కస్టడీకి నందిగం సురేష్
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను రెండు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ మంగళగిరి అడిషనల్ జూనియర్ సివిల్ కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. టీడీపీ కేంద్ర కార్యాలయంలో దాడి కేసులో ఆయనను ఈ నెల 5న హైదరాబాద్‌లో మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణకు సహకరించడం లేదని, 8 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు 2 రోజుల కస్టడీ ఇచ్చింది. ప్రస్తుతం నందిగం సురేష్ గుంటూరు జైలులో ఉన్నారు.

సంబంధిత పోస్ట్