ఆళ్లగడ్డ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం జరిగిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మా అమ్మ శోభ నాగిరెడ్డి ఈ గర్ల్స్ హై స్కూల్ లోనే చదువుకున్నారు. కనుక ఈ స్కూలు కు రావడం జరిగిందన్నారు. చాలా మంది విద్యార్థులు డ్రగ్స్ వలలో పడి మంచి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని, దయచేసి పిల్లలు ఎవరు తమ ఉజ్వల భవిష్యత్తును దూరం చేసుకోవద్దన్నారు