ఆళ్లగడ్డ ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. వైస్ ప్రిన్సిపల్ శారా విజయ్ కుమారి ఆధ్వర్యంలో పట్టణ ఎస్సై నగీన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత స్వాతంత్ర సంగ్రామంలో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి బ్రిటిష్ వారిపై విరోచితంగ పోరాడి, దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన వీరనారి మహిళా సాధికారతకు నేటి మహిళలకు బాలికలకు ఆదర్శమని కొనియాడారు.