ఆలూరు: కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి

63చూసినవారు
దేవనకొండ మండలం కుంకునూరులో దాదాపు 30 ఎకరాలను రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లుగా మర్చి, ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధికార ప్రతినిధి రంగయ్య డిమాండ్ చేశారు. బుధవారం పత్తికొండలోని ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని ఆర్డీవో భరత్ నాయక్ కు వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. సర్వే నంబర్ లో 591లో 6. 59 ఎకరాలు ప్రభుత్వ భూమి కలిసిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్