కర్నూలు జిల్లాలో అకాల వర్షంతో పంటలు నీట మునిపోయాయి. మనేకుర్తి, కురుకుంద గ్రామాల్లో చేతికొచ్చే సమయంలో నీటిలో మునగడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆదివారం వర్షం దెబ్బకు మిరపకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు రైతులు ఆవేదన చెందుతున్నారు. అప్పులు చేసి మరీ సాగు చేశామని, పంట చేతికందే సమయంలో ఇలా అయిందని ఆవేదన చెందుతున్నారు. పంట చేతికొచ్చే సమయంలో కురిసిన అకాల వర్షానికి పంట తడిసిపోయిందన్నారు.