ఆదోని నుంచి హొళగుందకు వస్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పొలంలోకి దూసుకెళ్లింది. ఆదోని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హొళగుంద మీదుగా ఎల్లార్తికి వెళ్లేందుకు ఆదివారం ఆదోని నుంచి బయలుదేరింది. రోడ్డు అధ్వానంగా ఉండడంతో డ్రైవర్ గుంతలను తప్పించబోయే ప్రయత్నంలో బస్సు అదుపు తప్పి పక్కనున్న పొలంలోకి దూసుకెళ్లింది. బస్సులో ఉన్న 50 మంది ప్రయాణికులకు ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.