అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తానన్న సీఎం చంద్రబాబు, ఎన్నికల హామీపై దృష్టి సారించాలని సిపిఐ మండల కార్యదర్శి సుబ్బారెడ్డి, ప్రజా నాట్యమండలి నంద్యాల జిల్లా కార్యదర్శి శివయ్య డిమాండ్ చేశారు. సోమవారం బనగానపల్లె 1,2,3 సచివాలయం వద్ద నిరసన కార్యక్రమం చేశారు. పేదలకు గ్రామాలలో 3 సెంట్లు, పట్టణాలలో 2 సెంట్లు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షల చొప్పున మంజూరు చేయాలని కోరుతూ సచివాలయ అధికారులకు వినతులు అందజేసారు.