బనగానపల్లె మండలం పలుకూరు గ్రామానికి చెందిన జెకెఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జె ఎస్ ఎస్ బ్రహ్మానంద చారిని, రవ్వల కొండకు చెందిన నరసింహ స్వామి ఆలయం వ్యవస్థాపక అధ్యక్షుడు పావన నరసింహ మూర్తి మంగళవారం ఘనంగా సన్మానించారు. 22 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్న బ్రహ్మానంద చారిని ఆయన అభినందిస్తూ, సమాజ సేవే భగవంతుని సేవ అని తెలిపారు.