సంజామల మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో మంగళవారం భారీ వర్షం కురిసింది. అర్థగంటపాటు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురవడంతో పలు కాలనీల్లో నీరు నిలిచింది. రైతులు సాగు చేసిన పంటలకు కొంత ఊరటనిచ్చింది. కురిసిన వర్షానికి సంజామలలోని ప్రధాన డ్రైనేజ్ కాలువ నుంచి వర్షపు నీరు పైకెక్కి వ రోడ్డుపై చేరాయి. వర్షాల నేపథ్యంలో ప్రజలు చల్లటి వాతావరణం, ప్రకృతిని ఆస్వాదించారు.