ప్రేమ వివాహాన్ని కుటుంబ సభ్యులు నిరాకరించడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం కొలిమిగుండ్లలో చోటుచేసుకుంది. బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ సమీపంలో నివాసముంటున్న సింహాద్రి (20) అనంతపురానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. కులాంతర వివాహం చేసుకుంటానని కుటుంబ సభ్యులకు చెప్పడంతో అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.