కొలిమిగుండ్ల మండలంలో సోమవారం ఓ మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి తీవ్రమైన ఎండ ప్రభావం ఉన్నప్పటికీ సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మారిపోయి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో గ్రామంలోని డాక్టర్ రామసుబ్బారెడ్డి వీధిలో చెట్టు కూలిపోయి విద్యుత్ స్తంభంపై పడి కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ శాఖ అధికారులు సుమారు 3 గంటల పాటు శ్రమపడి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.