మానవ హక్కులకు భంగం కలిగిస్తే ఉపేక్షించనని హ్యూమన్ రైట్స్ హెచ్ఆర్పిసిఐ రాష్ట్ర ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ ఆర్ కె. కంబగిరి స్వామి హెచ్చరించారు. గురువారం ఆయన బనగానపల్లెలో మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రసాదించిన మానవ హక్కులను సక్రమంగా సద్వినియోగం చేసుకొని స్వేచ్ఛగా జీవించాలని కోరారు. ఎంతటి స్థాయి వ్యక్తికైనా మానవ హక్కులకు ఉల్లంఘన కలిగిస్తే జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.