కోడుమూరు గ్రామ పంచాయతీకి సంబంధించిన మోటర్ల సమీపం నుంచి ఇసుక తరలింపును అడ్డుకోవాలని ఈవో ఎం. అజయ భాస్కర్, సర్పంచ్ భాగ్యరత్న కోరారు. సోమవారం కోడుమూరు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వెంకటేష్ నాయక్ ను కలిసి వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. కోడుమూరు హంద్రీనది నుండి ఇతర గ్రామాలకు, వ్యాపారస్తులకు ఇసుకు రవాణాపై ఈవో అనుమతి ఉండేలా చర్యలు తీసుకుంటామని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు.