కోడుమూరు నియోజకవర్గం నుంచి రాష్ట్ర కురువ, కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ గా గూడూరు మండలం పెంచికలపాడుకు చెందిన కురువ వెంకట రాముడుని మంగళవారం టీడీపీ అధిష్ఠానం నియమించింది. వెంకటరాముడు మాట్లాడారు. కురువ, కురుబ కులస్తులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసానిచ్చారు. తనకు పదవీ రావడానికి సహకరించిన కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లుకు కృతజ్ఞతలు తెలిపారు.