కోడుమూరు ఎక్సైజ్ సీఐగా ఎం. మంజుల బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం ఇక్కడ సీఐగా పనిచేస్తున్న రామాంజనేయులు నందికొట్కూరుకు బదిలీపై వెళ్లడంతో అధికారులు మంజులను సీఐగా నియమించారు. ఈ మేరకు ఆమె విధుల్లో చేరి సర్కిల్ పరిధిలోని సమస్యలపై ఎక్సైజ్ సిబ్బందితో చర్చించారు. బదిలీపై నందికొట్కూరు సీఐగా వెళ్లిన రామాంజనేయులును స్థానిక ఎక్సైజ్ సిబ్బంది ఘనంగా సత్కరించారు.