ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయం వద్ద సాధారణ ధరల కంటే అధిక ధరలతో విక్రయాలు జరిపితే కేసు నమోదు చేసుకుని చర్యలు తీసుకోవాలని పోలీసు వారికి సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ శ్రావణమాసం సందర్భంగా భక్తులు వివిధ ప్రదేశాల నుండి ఈరన్న స్వామిని దర్శించుకునేందుకు వచ్చే సందర్భంలో భక్తులు తలనీలాలు సమర్పించేవారి దగ్గర నుండి రూ 40 మరియు టెంకాయలు రూ 20 మాత్రమే విక్రయించాలన్నారు.