కౌతాళం మండలం గుడికంబాల గ్రామంలో ఆదివారం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 30వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ 60వ జన్మదిన వేడుకలను నిర్వహించారు.