ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సంభవించిన నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యన్న డిమాండ్ చేశారు. గురువారం పెద్దకడుబూరు మండల తహసీల్దార్ ఆఫీసు వద్ద ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అధిక వర్షాలతో రైతులు సాగు చేసిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, తక్షణమే రైతులను ఆదుకోవాలని ఆర్ఐ మహేష్ కు వినతిపత్రం అందజేశారు.